Mon Dec 02 2024 15:57:47 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభ అభ్యర్థిపైనే చర్చా? పవన్, బాబు భేటీలో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రధానంగా రెండు, మూడు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగుతుండటంతో తమ పార్టీ అభ్యర్థి పేరును కూడా పవన్ కల్యాణ్ చెప్పే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు.
కాకినాడ పోర్టులో...
నాలుగేళ్లు మాత్రమే కాలపరిమితి ఉన్న రాజ్యసభ పదవి మాత్రం నాగబాబుకు అవసరం లేదని చెబుతున్నట్లు తెలిసింది. అయితే పవన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ సురేష్ ప్రభుకు రాజ్యసభ స్థానం ఇవ్వాలనికోరినట్లు తెలిసింది. దీనిపై కూడా చర్చ జరగనుంది. మరోవైపు కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై కూడా పవన్ కల్యాణ్ చంద్రబాబు తో చర్చించనున్నారు. షిప్ ను సీజ్ చేయాలన్న దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించనున్నారు. రేపు జరగబోయే కేబినెట్ లో ఈ అంశం చర్చకు రానున్న నేపథ్యంలో వీరు దీనిపై ఒక అవగాహనకు వచ్చే అవకాశముందని తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download the app now
Next Story