Mon Dec 15 2025 08:06:50 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలసి ఆయన విజయవాడ దుర్గమాత ఆలయానికి వచ్చారు. పవన్ కల్యాణ్ కు వేదపండితులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ఏర్పాట్లను దర్శనానికి చేశారు. ఈరోజు మూలా నక్షత్రం కావడం, అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో పవన్ కల్యాణ్ దుర్గమ్మ దర్శనానికి వచ్చారు.
కుమార్తెతో కలసి...
దర్శనం చేసుకున్న అనంతరం పవన్ కల్యాణ్ కు అర్చకులు తీర్థప్రసాదాలను అదచేశారు. నేడు సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ మీద వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికిపట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఈరోజు వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.
Next Story

