Mon Dec 02 2024 13:40:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక వ్యవహారాలపై ఇద్దరు చర్చించుకునే అవకాశం. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లివచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారిచంద్రబాబుతో సమావేశం అవుతున్నారు.
ఢిల్లీ, కాకినాడ పర్యటనలపై...
ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడి రాష్ట్రానికి తీసుకు వచ్చిన నిధులపై చర్చించనున్నారు. బీజేపీ పెద్దల మనసులో మాటను కూడా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వివరించనున్నారు. దీంతో పాటు రెండు రోజుల క్రితం కాకినాడ పోర్టులో తాను సందర్శించినప్పుడు అక్కడ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న తీరుపై కూడా పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చర్చించనున్నారు.
Next Story