Mon Apr 14 2025 00:20:40 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : రేపు వెస్ట్ గోదావరికి పవన్
రేపు మొగల్తూరు, పెనుగొండలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

రేపు మొగల్తూరు, పెనుగొండలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నట్లు ప్రభుత్వ వర్గాలువ వెల్లడించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశాలుండటంతో పోలీసులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తన పర్యటనలో...
పవన్ కల్యాణ్ తన పర్యటనలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఉదయం మొగల్తూరులో పవన్ కళ్యాణ్ గ్రామ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించనున్న పవన్ అధికారులను ఆదేశించనున్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, నీటి సరఫరా, విద్యుత్ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Next Story