Mon Dec 23 2024 16:08:01 GMT+0000 (Coordinated Universal Time)
వ్యవస్థలను బతికించుకోవడానికి ఎన్నో పోరాటాలు చేశాం : పవన్ కల్యాణ్
వ్యవస్థలను బతికించడానికే ఐఏఎస్, ఐపీఎస్లు పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
వ్యవస్థలను బతికించడానికే ఐఏఎస్, ఐపీఎస్లు పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో తాము ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, అనేక పోరాటాలు చేసి తట్టుకుని నిలబడ్డామని తెలిపారు. తాము వ్యవస్థలను బతికించాలనే ఈ రంగంలోకి వచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందన్నారు.
పాలన ఎలా ఉండకూడదో...
పాలన ఎలా ఉండకూడదో చూపించిన గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకూడదన్నారు. మంత్రులు ఏదైనా తప్పులు చేస్తే ధైర్యంగా చెప్పగలిగే స్థాయికి ఐఏఎస్, ఐపీఎస్ లు చేరుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. 13,326 పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించి ఉపాధి హామీ పనులను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని తెలిపారు. పాలనలో కలెక్టర్లు, ఎస్పీల సహకారం అవసరమని ఆయన అన్నారు.
Next Story