Fri Mar 28 2025 12:13:01 GMT+0000 (Coordinated Universal Time)
టీచర్లపై డిప్యూటీ సీఎం హార్ష్ కామెంట్స్
ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు

ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. అందులో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా అని నారాయణస్వామి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పై కొందరు ఉపాధ్యాయులు వాడిన భాష సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ పిల్లలను....
లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా? అని నారాయణస్వామి ప్రశ్నించారు. వారి పిల్లలను ప్రయివేటు స్కూళ్లకు ఎందుకు పంపుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదైనా ఉంటే చర్చలకు వెళ్లాలి కాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అందులో పవిత్ర మైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి అసలు తగదని నారాయణస్వామి హితవు పలికారు.
Next Story