Wed Dec 25 2024 17:32:01 GMT+0000 (Coordinated Universal Time)
మరిన్ని కీలక అంశాలు బయటకు వస్తాయా?
వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం కడప జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను విచారించాలని, అందుకు తమకు కస్టడీకి అప్పగించాలని సీబీఐ పులివెందుల కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
వారం రోజుల కస్టడీ....
దీనిపై విచారించిన పులివెందుల కోర్టు దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఏడు రోజుల సీీబీఐ కస్టడీకి అనుమతించింది. సీబీఐ ఎనిమిది రోజుల కస్టడీని కోరగా కోర్టు వారం రోజులు మాత్రమే ఇచ్చింది. వచ్చే నెల రెండో తేదీ వరకూ దేవిరెడ్డి శంకర్ రెడ్డి సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఆయనను వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలను రాబట్టేందుకు సీబీఐ విచారణ చేయనుంది.
Next Story