Fri Jan 10 2025 21:57:41 GMT+0000 (Coordinated Universal Time)
Ys Viveka : వైఎస్ వివేకా హత్య కేసులో దేవిరెడ్డికి బెయిల్
వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరయింది
వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గత కొంతకాలంగా నిందితుడిగా జైలులో ఉన్నారు. ఆయన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో గత కొద్ది రోజులుగా జైలులో ఉన్నారు. అయితే ఆయనకు తాజాగా తెలంగాణ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది.
షరతులతో కూడిన....
దేవిరెడ్డి శంకర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం విధిగా సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సీబీఐ కోర్టులో విచారణ జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని నిబంధన కూడా విధించింది. పాస్పోర్టును కూడా కోర్టుకు అందచేయాలని ఆదేశించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి 2021 సెప్టంబరు 17వ తేదీన అరెస్టయ్యారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన బెయిల్ పై బయటకు రానున్నారు.
Next Story