Sun Dec 22 2024 17:07:03 GMT+0000 (Coordinated Universal Time)
Leopard : శ్రీశైలంలో చిరుతపులి.. భయాందోళనలో భక్తులు
శ్రీశైలంలో చిరుతపులి సంచారంతో భక్తులు భయపడిపోతున్నారు
శ్రీశైలంలో చిరుతపులి సంచారంతో భక్తులు భయపడిపోతున్నారు. పాతాళగంగ ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఉన్న ఆలయానికి చెందిన ఏఈఓ ఇంటివద్ద రాత్రి చిరుతపులి కనిపించింది. ఇంటి ప్రహరీగోడపై చిరుత నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుత అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తకెళ్లిపోవడం కెమెరాలో కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వచ్చి...
చిరుతపులి ఇలా రాత్రి వేళ తిరుగుతుండటంతో భక్తులు కూడా బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. చిరుతపులి సంచారం విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Next Story