Tue Jan 07 2025 16:32:19 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం
శ్రేశైలం లో నేడు స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈరోజు నుంచి స్పర్శ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది.
శ్రేశైలం లో నేడు స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈరోజుం నుంచి ఐదు రోజుల పాటు స్పర్శ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. చాలా రోజుల తర్వాత దీనిని ప్రారంభిస్తున్నారు. శ్రీశైలం మహా క్షేత్రానికి వెళ్లి అక్కడ స్వామి వారిని తాకడం మహా పుణ్యంగా భావిస్తారు. పవిత్ర జలాలతో తమ చేతుల మీదుగా స్వామి వారికి పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందని భావిస్తారు. అయితే కోవిడ్ కారణంగా స్పర్శ దర్శనాన్ని అధికారులు నిలిపేశారు.
చాలా రోజుల తర్వాత....
చాలా రోజుల తర్వాత స్పర్శ దర్శనానికి అధికారులు అనుమతి ఇవ్వడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు, రేపు మధ్యాహ్యం రెండు గంటల నుంచి మూడు గంటల వరకూ భక్తులకు ఉచిత దర్శనం కూడా కల్పించనున్నారు. కాగా ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకూ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story