Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా క్యూ కట్టిన భక్తులు.. దర్శనానికి?
తిరుమలలో ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. గురువారం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రద్దీ ఏమాత్రం తగ్గలేదు.
తిరుమలలో ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. గురువారం అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రద్దీ ఏమాత్రం తగ్గలేదు. నిన్న క్రిస్మస్ నేడు బాక్సింగ్ డే సెలవు దినాలు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. తిరుమలలోని వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే సమయంలో క్యూ లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దర్శనానికి గంటల సమయం పడుతుండటంతో గోవింద నామసర్మరణలతో క్యూలైన్ లలో ఉన్నభక్తులు ముందుకు సాగుతున్నారు. వరస సెలవులు రావడంతో ఇంత అధికంగా భక్తులు వచ్చారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ