Mon Dec 23 2024 13:30:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మార్చి నెల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది
తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో తిరుమల కొండ కిటకిట లాడుతుంది. ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేశారు. ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లు లక్షల సంఖ్యలో కొనుగోలు చేసిన భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులందరికీ మంచినీరు, అన్న ప్రసాదాలను అందించేలా చర్యలు తీసుకుంది.
పది గంటలకు....
ఈరోజు ఉదయం పది గంటలకు మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మూడు వందల రూపాయల టిక్కెట్లను ఆన్లైన్ లో ఉంచనుంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ కూడా ప్రారంభం అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు కొనుగోలు చేయడానికి భక్తులు వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story