Tirumala : తిరుమలలో ఆదివారం కూడా భక్తులు లేరే... రీజన్ ఇదేనా?
తిరుమలలో భక్తులు తక్కువగా ఉన్నారు. ఆదివారం కూడా భక్తులు ఎక్కువ మంది రాలేదు
తిరుమలలో భక్తులు తక్కువగా ఉన్నారు. ఆదివారం కూడా భక్తులు ఎక్కువ మంది రాలేదు. శనివారం నుంచి తిరుమలలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. స్వామి వారిని కంపార్ట్ మెంట్ లలో వేచి ఉండకుండానే నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. సులువుగా దర్శనం అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉండేవారు తిరుమలలో రద్దీ లేదని తెలుసుకుని వారు ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రం వచ్చి ఆపదమొక్కుల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరో ఐదు రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానుండటంతో దానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముంది. అందుకే ఈ రెండు రోజుల నుంచి భక్తుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త టీటీడీ బోర్డు వేయడంతో ప్రతిష్టాత్మకంగా ఈ వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను కూడా దాదాపు 1.20 లక్షల టోకెన్లను తిరుపతి, తిరుమలలో జారీ చేసేందుకు నిర్ణయించింది. వాహనాల పార్కింగ్ కు కూడా అవసరమైన స్థలలాను కేటాయించింది.
నేరుగా దర్శనం...