Sat Nov 23 2024 00:42:02 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి.. ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు
తాజాగా ఏపీ మంత్రి ఉషా శ్రీ చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం భక్తులను ఆగ్రహానికి గురిచేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్
వరుసగా నాలుగు రోజులు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు రావడంతో.. తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గత మూడ్రోజులుగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోతోంది. భక్తుల రద్దీ కారణంగా.. శ్రీవారి సర్వదర్శనానికి గంటలకొద్దీ సమయం పడుతోంది. మధ్యలో వీఐపీ బ్రేక్ దర్శనాలతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు.
తాజాగా ఏపీ మంత్రి ఉషా శ్రీ చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం భక్తులను ఆగ్రహానికి గురిచేసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మంత్రి తన 50 మంది అనుచరులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. క్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ... మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి టీటీడీ టికెట్లను జారీ చేసిందని భక్తులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో ఆమె గన్ మెన్లు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
Next Story