Mon Dec 23 2024 15:21:08 GMT+0000 (Coordinated Universal Time)
దుర్గగుడికి పోటెత్తిన భక్తులు
మూలా నక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు
మూలా నక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. తెల్లవారుజామున మూడు గంటల నుంచే దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశముండటంతో ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. కెనాల్ రోడ్డు వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది.
అర్థరాత్రి నుంచే....
నిన్న అర్ధరాత్రి 1.30 గంటలక నుంచే భక్తులందరికీ ఉచితంగా దర్శనం కల్పిస్తున్నారు. ఈరోజు అందరికీ సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారానే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తారు. వీఐపీ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. వాహనాలను కొండ మీదకు అనుమతించడం లేదు. భక్తులను నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యమయిపోయింది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇందుకోసం విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీ బందోబస్తు చేస్్తున్నారు.
Next Story