Mon Dec 23 2024 02:50:54 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్రపై వర్లకు డీజీపీ లేఖ
నారా లోకేష్ పాదయాత్రపై పూర్తి వివరాలు ఇవ్వాలంటూ డీజీపీ కోరారు. ఈ మేరకు వర్ల రామయ్యకు లేఖ రాశారు
నారా లోకేష్ పాదయాత్రపై పూర్తి వివరాలు ఇవ్వాలంటూ డీజీపీ కోరారు. పాదయాత్ర నాలుగు వందల రోజుల పాటు ఎక్కడెక్కడ జరుగుతుంది? రోజూ యాత్రలో ఎంత మంది? ఎవరు? పాల్గొంటారు? అన్న వివరాలను అందించాలని డీజీపీ కోరారు. ఈ మేరకు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను కోరారు. పూర్తి వివరాలను ఇచ్చిన తర్వాత అనుమతి విషయం పరిశీలిస్తామని డీజీపీ తెలియ చేశారు. ఎక్కడెక్కడ బస చేస్తారో కూడా వివరాలను అందిస్తే ముందుగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తారని డీజీపీ లేఖలో తెలిపారు.
ఎక్కడికక్కడ పోలీసులకు...
అయితే ఇందుకు వర్ల రామయ్య కూడా డీజీపీకి తిరిగి లేఖ రాశారు. గతంలో నేతలు పాదయాత్రలు చేసినప్పుడు ఇలాంటి వివరాలు పోలీసు శాఖ అడగలేదన్నారు. ఏ రోజో కారోజు వచ్చే ప్రజల సంఖ్యను బట్టి బందోబస్తును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందని వర్ల రామయ్య లేఖల తెలిపారు. లోకేష్ పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులకు తెలియపరుస్తామని వర్ల రామయ్య డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అనుమతి వచ్చినా, రాకున్నా తాము పాదయాత్ర చేసి తీరుతామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
- Tags
- nara lokesh
- dgp
Next Story