Mon Dec 23 2024 13:59:55 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కేసు : వివరాలు వెల్లడించిన డీజీపీ
శరత్ ఇంట్లో ఉన్న రూ.15 లక్షలు, ఖాతాలో నుండి మరో రూ.60 లక్షలు తీసుకున్నారన్నారు. అలాగే ఆడిటవ్ జీవీ ను కొట్టి బెదిరించి..
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడి కిడ్నాప్ వ్యవహారంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఎంపీ కుటుంబ సభ్యుల నుంచి కిడ్నాపర్లు రూ.1.75 కోట్లు వసూలు చేశారు. నిందితులు హేమంత్, రాజేశ్, సాయిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.86.5 లక్షలు వసూలు చేశామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ వెల్లడించారు. నిందితులు హేమంత్, రాజేశ్, సాయి.. ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోకి వెళ్లి కట్టేసి, కత్తితో బెదిరించారని తెలిపారు. ఆ మరుసటిరోజున ఎంపీ భార్య జ్యోతిని కుమారుడు శరత్ తో ఫోన్ చేయించి పిలిపించారు. ఆ తర్వాత ఆవిడను, ఆడిటర్ జీ వీ ను కూడా కట్టేసి బెదిరించారని వివరించారు.
శరత్ ఇంట్లో ఉన్న రూ.15 లక్షలు, ఖాతాలో నుండి మరో రూ.60 లక్షలు తీసుకున్నారన్నారు. అలాగే ఆడిటవ్ జీవీ ను కొట్టి బెదిరించి కోటి రూపాయల వరకూ డబ్బు తెప్పించుకున్నారన్నారు. కిడ్నాప్ పై తమకు సమాచారం అందిన గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకున్నారని తెలిపారు. రుషికొండ ప్రాంతంలో కిడ్నాపర్లున్నట్లు సమాచారం రాగా.. పోలీసులు వెంబడించారు. పోలీసులకు కిడ్నాప్ వ్యవహారం తెలిసిందని తెలుసుకున్న మరుక్షణం.. ముగ్గురినీ కారులో తీసుకుని పరారయ్యేందుకు ప్రయత్నించారన్నారు. పద్మనాభం ప్రాంతంలో కిడ్నాపర్ల కారు ఆగిపోవడంతో.. ముగ్గురు బాధితులను అక్కడే వదిలేసి కిడ్నాపర్లు పరారయ్యారని డీజీపీ తెలిపారు.
ఎంపీ కుటుంబ సభ్యులు చెప్పిన ఆధారాల ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకున్నామన్నారు. ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినందుకు రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని అనడం సరికాదని డీజీపీ అసహనం వ్యక్తం చేశారు. కిడ్నాప్ వ్యవహారాన్ని శాంతి భద్రతలకు, రాష్ట్రంలో క్రైం రేటుకు ముడిపెట్టడం సరికాదన్నారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్ వెల్లడించారు.
పద్మనాభం ప్రాంతంలో కిడ్నాపర్ల కారు ఆగిపోవడంతో.. ముగ్గురు బాధితులను అక్కడే వదిలేసి కిడ్నాపర్లు పరారయ్యారని డీజీపీ తెలిపారు. తర్వాత వాళ్లను పట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని వస్తున్న వార్తలను డీజీపీ ఖండించారు. ఈ ఘటనను శాంతిభద్రతలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకొచ్చారు.
Next Story