Mon Nov 25 2024 04:37:52 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు గెరిల్లా యుద్ధం చేయదలచుకున్నారా?
ప్రభుత్వం ఉత్తర్వులను కాదని చంద్రబాబు గెరిల్లా యుద్ధం చేయదలచుకున్నారా? అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ప్రభుత్వం ఉత్తర్వులను కాదని చంద్రబాబు గెరిల్లా యుద్ధం చేయదలచుకున్నారా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఈ జీవో అవసరమా? కాదా? అన్నది చంద్రబాబు చెప్పాలన్నారు. కందుకూరు మారణకాండకు బాబు సభ కారణం కాదా? అని నిలదీశారు. అసలు జీవో చంద్రబాబు చదివారా? జీవోలో రోడ్ షోలు, ర్యాలీలు నిషేధం అని ఎక్కడైనా ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలూ ఈ జీవోకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. ఉండక తప్పదని సజ్జల అన్నారు. ఆ జీవోకు తమ పార్టీ వైసీపీ కూడా కట్టుబడి ఉంటుందని తెలిపారు. తనను ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లవుతుందని చంద్రబాబు కలరిస్తున్నారన్నారు.
ఎవరికీ గాయలు కాకపోయినా...
పోలీసుల లాఠీ ఛార్జిలో ఎవరికి గాయాలు కాలేదని, అదంతా డ్రామా అని అన్నారు. చంద్రబాబు వచ్చే సరికి ఆసుపత్రిలో ఉండి, ఆయన అటు వెళ్లగానే వారు వెళ్లిపోవడాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుందిన్నారు. జనం పట్టించుకోవడం లేదన్నదే చంద్రబాబు అసలు బాధ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు చేసిన తప్పిదం వల్లనే కందుకూరు, గుంటూరుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ స్థలాల్లో సభలు పెట్టుకోవచ్చని సూచించినా చంద్రబాబు ఆ వైపు ఎందుకు మొగ్గు చూపడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రోజూ తిరగాడని, ఆయనను ఎవరూ అడ్డుకోలేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Next Story