Ys Sharmila : షర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చి తప్పు చేశారా?
వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చి తప్పు చేశారా? అన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచే వినపడుతున్నాయి
వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చి తప్పు చేశారా? అన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచే వినపడుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు తెలంగాణ వైఎస్సార కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం ఆమె నేరుగా టీపీసీసీ చీఫ్ అయ్యారు. అయితే వైసీపీ అధినేత జగన్ కు చెక్ పెట్టడానికే ఆమెను అంత పెద్ద పదవిని అప్పగించారని భావించిన సీనియర్ నేతలు ఆమెకు సహకరించడం మానేశారు. ప్రజలు కూడా మొన్నటి ఎన్నికల్లో పట్టించుకోలేదు. ఫలితంగా ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా పార్టీని బలోపేతం చేస్తారని భావించినా హైకమాండ్ అంచనాలు తప్పయ్యాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కోలుకోలేదన్న దానికి మొన్నటి ఎన్నికలే నిదర్శనమని చెప్పక తప్పదు. షర్మిల రాకతో ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆమెను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజికవర్గం పరంగా కూడా పార్టీకి ఇబ్బంది కరంగా మారడంతో ఆమెను తప్పించి మరొకరికి ఈ పదవి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
పనితీరుపై ఫిర్యాదులు…
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now