Thu Dec 19 2024 23:02:59 GMT+0000 (Coordinated Universal Time)
కన్నీళ్లు పెట్టుకున్న బుద్దా వెంకన్న
కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది
కృష్ణా జిల్లా నేతలకు చంద్రబాబు ఇటీవల క్లాస్ పీకారు. పనితీరు బాగాలేదని చెప్పారు. అయినా ఆ జిల్లా నేతల్లో మాత్రం మార్పు రాలేదు. తాజాగా కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేతలకు సరైన గౌరవం దక్కలేదని వారు ఆరోపిస్తున్నారు. బుద్దా వెంకన్న తన ఫొటోను ఫ్లెక్సీపై ఉంచకపోవడంతో ఆయన ఆగ్రహించారు.
బాబు క్లాస్ పీకినా ...
అనంతరం ఆయన కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయారు. వేదిక మీదకు రావాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుద్దా వెంకన్నను పదే పదే కోరినా ఆయన కిందనే కాసేపు కూర్చుని సమావేశం మధ్య నుంచి వెళ్లిపోయారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బతిమంాలినా ఆయన వినకుండా వెళ్లిపోయారు. కాసేపు ఉన్న తర్వాత సమావేశం నుంచి బుద్దా వెంకన్నతో పాటు నాగుల్ మీరా కూడా వెళ్లిపోయారు. ఇక ఈ సమావేశంలో గద్దె రామ్మోహన్ ను వేదికపైకి ఆహ్వాినించలేదంటూ ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story