Tue Apr 15 2025 22:20:04 GMT+0000 (Coordinated Universal Time)
Ramgopal Varma : వర్మ అరెస్ట్ తప్పదా?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈరోజు హాజరు కావాలని మద్దిపాడు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత పోస్టులను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
హాజరు కాలేనని..
అయితే నేడు కూడా తాను హాజరు కాలేనని రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు పోలీసులకు సమాచారం పంపారు. అయితే మద్దిపాడు పోలీసులు ఈరోజు వర్మను అదుపులోకి తీసుకుని ఈ కేసులో విచారణ జరిపే అవకాశముందని తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో వర్మను అదుపులోకి తీసుకోవాలని మద్దిపాడు పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story