Sun Dec 22 2024 22:08:35 GMT+0000 (Coordinated Universal Time)
పంచభూతాల మీద ప్రమాణం.. ఆ వాయిస్ నాది కాదు
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ సంచలనమే. ఈరోజు 12 గంటలకు చంద్రబాబుపై సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ సంచలనమే. కొత్త కొత్త ఆలోచనలతో ఆయన సోషల్ మీడియాలో తనకు అనిపించిన పోస్టులను పెడుతుంటారు. ఆర్జీవీ పోస్టులు అభ్యంతరకరంగా ఉంటాయని కొందరు ఆలోచింప చేసేవిగా ఉంటాయని మరికొందరు అంటుంటారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఈరోజు 12 గంటలకు ఒక సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో....
అయితే సీబీఎన్ సైకో సాంగ్ లోని లిరిక్స్, వాయిస్, మ్యూజిక్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో రూపొందించినవేననని రామగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇందులో ఒక వాయిస్ తనది కాదు. కానీ అది తన వాయిస్ తో పోలి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో క్రియేట్ చేసిందేనని రామ్ గోపాల్ వర్మ తెలిపాు. పంచభూతాల మీద ప్రమాణంచేస్తున్నానని, ఆ వాయిస్ తనది కాదన్నారు ఆర్జీవీ. ఈరోజు 12 గంటలకు దానిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Next Story