Thu Dec 19 2024 17:46:25 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశమున్నందున ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ జిల్లాల్లో...
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తర్పు.గోదావరి, ఏలూరు, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
Next Story