Fri Nov 22 2024 19:36:08 GMT+0000 (Coordinated Universal Time)
చర్చలు సంతృప్తికరమే
ప్రభుత్వ ఉద్యోగులకు, మంత్రుల కమిటీ మధ్య చర్చలు ఫలించాయి
ప్రభుత్వ ఉద్యోగులకు, మంత్రుల కమిటీ మధ్య చర్చలు ఫలించాయి. ఏపీ ఉద్యోగులు నోటీసు ఇవ్వడంతో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయి వారితో చర్చలు జరిపింది. కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు కొంత సంతృప్తి వ్యక్తం చేసినట్లే కనపడుతున్నాయి. రేపటి నుంచి దశల వారీ ఆందోళన జరుపుతామన్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకూ వెనక్కు తగ్గమని భేటీ అనంతరం తెలిపారు.
పెండింగ్ సమస్యలపై...
మంత్రుల కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సూర్యనారాయణను తప్పించి మిగిలిన ఉద్యోగ సంఘాలను కమిటీ చర్చలకు ఆహ్వానించింది. పెండింగ్ సమస్యలపై తాము చర్చించామని తర్వాత మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సానుకూలంగా సమావేశం జరిగిందని తెలిపారు.
బకాయీలను...
మూడు వేల కోట్ల మేర బకాయీలను ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని సజ్జల తెలిపారు. అలాగే మార్చి 31వ తేదీలోపు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్స్ క్లియర్ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్ బకాయీలను కూడా మార్చి 31వతేదీలోగా చెల్లిస్తామని తెలిిపారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ అరియర్స్ అన్నీ క్లియర్ చేస్తామని సమావేశంలో వారికి హామీ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story