Thu Apr 03 2025 01:38:24 GMT+0000 (Coordinated Universal Time)
బాలికను కాపాడిన దిశ
సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్తోన్న పక్కింటి బాలిక(16)ను బలవంతంగా తన గదిలోనికి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ యాప్ ను తీసుకుని వచ్చింది. ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్ ద్వారా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించవచ్చు. అలా కొందరిని ఇప్పటికే దిశ యాప్ చాలా మందిని కాపాడింది. ఇప్పుడు మరో అమ్మాయి ఆపదలో ఉండగా.. దిశ యాప్ ద్వారా సహాయం అందింది.
తన పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో అతడి నుండి తప్పించుకున్న బాలిక దిశ యాప్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో నివాసముండే యువకుడు (20) సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్తోన్న పక్కింటి బాలిక(16)ను బలవంతంగా తన గదిలోనికి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తండ్రి ఫోన్ నుంచి దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయగా 10 నిమిషాల్లోనే బాధితురాలి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. విచారణలో యువకుడు బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Next Story