Ys Jagan : వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చేశారు.. షర్మిలపై కోర్టును ఆశ్రయించిన వైసీపీ ఛీఫ్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ , ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయ
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ఓ వైపు షర్మిల కూడా కారణమనే టాక్ ఉంది. ఇక ప్రతి పక్షంలో ఉన్నా కూడా వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూనే వస్తోంది షర్మిల. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్ధమైన షేర్ బదిలీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) పిటిషన్‌ను ఫైల్ చేశారు వైఎస్ జగన్.వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కి సమర్పించిన పిటిషన్లో తన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని. తమ తల్లి వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతీ పవర్ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని జగన్, ఆయన భార్య భారతి రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.