Sun Dec 22 2024 21:52:32 GMT+0000 (Coordinated Universal Time)
Pensions : నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేడు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ కావడంతో పింఛన్లు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమయింది. మొత్తం 65.30 లక్షల మందికి నేటి నుంచి పింఛన్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 1,939 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.
గత నెల మాదిరిగానే...
అయితే గతంలో మాదిరిగా బ్యాంకు అకౌంట్లున్న వారికి నేరుగా వారి ఖాతాల్లో నగదును జమ చేయనుంది. అంటే డీబీటీ ద్వారా 47,74 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లలో పింఛను డబ్బులు జమ కానున్నాయి. మిగిలిన 17.56 లక్షల మందికి మాత్రం ఇంటికి వెళ్లి పింఛన్లు అందచేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ ఐదో తేదీ వరకూ ఇంటింటికీ తిరిగి పింఛన్లను పంపీణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
Next Story