Fri Nov 22 2024 21:32:54 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : వైఎస్సార్ పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తెల్లవారు జామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తెల్లవారు జామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. ప్రతి నెల ఒకటోతేదీన పింఛన్ల మొత్తం పంపిణీ చేస్తున్న జగన్ ప్రభుత్వం ఈ నెల కూడా అదే విధానాన్ని కొనసాగించింది. గత నెల పింఛను మొత్తాన్ని మూడు వేలకు ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఈరోజు ఒకటో తేదీ కావడంతో ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది.
ఇళ్లకు వెళ్లి...
వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పింఛను మొత్తాన్ని లబ్దిదారులకు అందచేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంులు, చేనేత, కల్లుగీత కార్మికులతో పాటు డప్పు కళాకారులకు కూడా ఈ పింఛను మొత్తాన్ని అందించనున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకోటో తేదీన పింఛను ఇవ్వడమే కాకుండా ప్రతి ఏడాది రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయింది. ఈ ఏడాది ఆ మొత్తం మూడు వేలకు చేరింది.
Next Story