Fri Nov 22 2024 09:18:37 GMT+0000 (Coordinated Universal Time)
Pensions : నేడు ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమయింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నవంబరు 1వ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ జరగనుంది. వృద్ధులకు, వితంతులకు నాలుగువేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
అధికారంలోకి రాగానే...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి నెల ఒకటో తేదీకి ఇంటివద్దకే పింఛన్లను అందచేయాలని చంద్రబాబు నిర్ణయించారు. వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టి కేవలం సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీని చేపట్టారు. ఒక్కరోజులోనే 98 శాతం పింఛన్ల పంపిణీ ప్రతి నెల మొదటి రోజు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం నిధులను ప్రభుత్వం నిన్ననే నిధులను జమ చేసింది.
Next Story