Sun Dec 29 2024 18:45:16 GMT+0000 (Coordinated Universal Time)
పేర్ని నానితో ముగిసిన డిస్ట్రిబ్యూటర్లు భేటీ
మంత్రి పేర్ని నానితో డిస్ట్రిబ్యూటర్లు భేటీ అయ్యారు. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు, థియేటర్ల మూసివేత పై వారు చర్చించారు
మంత్రి పేర్ని నానితో డిస్ట్రిబ్యూటర్లు భేటీ అయ్యారు. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు, థియేటర్ల మూసివేత పై వారు మంత్రితో చర్చించారు. ప్రధానంగా టిక్కెట్ల ధరలు తగ్గించడంతో తాము తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని మంత్రికి డిస్ట్రిబ్యూటర్లు వివరించారు. వచ్చే సంక్రాంతి పండగకు పెద్ద సినిమాలు విడుదలవుతుండటం, భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంతో సముచితమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి పేర్ని నానిని డిస్ట్రిబ్యూటర్లు కోరారు.
టిక్కెట్ల ధరలు....
కార్పొరేషన్ పరిధిలో ఏసీ థియేటర్లలో అత్యధికంగా హైయర్ క్లాస్ లో 150 రూపాయలు, లోయర్ క్లాస్ లో యాభై రూపాయలు, మున్సిపాలిటీ పరిధిలో నాన్ ఏసీ థియేటర్లలో లోయర్ క్లాస్ లో 30 రూపాయలు, హైయర్ క్లాస్ లో 80 రూపాయలు టిక్కెట్ ధరలు ఉండేలా చూడాలని డిస్ట్రిబ్యూటర్లు పేర్ని నానిని కోరారు. దీనిపై స్పందించిన పేర్ని నాని సామాన్యులకు తక్కువ ధరతో వినోదాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందుకు అవసరమైన కసరత్తు చేస్తుందని పేర్ని నాని తెలిపారు.
Next Story