Sun Dec 22 2024 18:16:12 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ గోరంట్లది మార్ఫింగ్ వీడియోనే.. ఎస్పీ నిర్ధారణ
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఆ వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేక పోతున్నామని తెలిపారు. ఒరిజనల్ వీడియో ఉంటే అది ఫేకా? మార్ఫింగా? అని తేల్చవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు. వైరల్ అయిన వీడియోను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని ఆయన అన్నారు. వీడియోకు సంబంధించి ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని ఫకీరప్ప తెలిపారు.
ఒరిజినల్ దొరికితేనే....
ఈ వీడియోను తొలుత ఐటీడీపీ వాట్సప్ గ్రూపులో పోస్టు చేశారని అన్నారు. ఈ నెల అర్థరాత్రి +447443703968 నెంబరు నుంచి పోస్ట్ అయినట్లు గుర్తించామని తెలిపారు. అది యూకేకు చెందిన వొడా ఫోను నెంబరుగా గుర్తించామని తెలిపారు. ఆ వీడియోను వేరే మొబైల్ ద్వారా చిత్రీకరించారని, ఒరిజినల్ వీడియో దొరికే వరకూ దీనిపై ఏమీ చేయలేమని ఎస్పీ ఫకీరప్ప అన్నారు. వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచరులు ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు.
Next Story