Fri Nov 22 2024 20:51:07 GMT+0000 (Coordinated Universal Time)
Divvela Madhuri : కావాలని కారును డ్యాష్ ఇచ్చారా? అనుకోకుండా యాక్సిడెంట్ అయిందా?
దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉంటున్న దివ్వెల మాధురి కారుకు యాక్సిడెంట్ అయింది. ఆమె ఆగి ఉన్న కారును ఢీకొట్టింది
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అసలు కథ ముగింపు ఎలా టర్న్ అవుతుందో తెలియనంత తరహాలో సీరియల్ తరహాలో సాగుతుంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉంటున్న దివ్వెల మాధురి కారుకు యాక్సిడెంట్ అయింది. ఆమె ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో యాక్సిడెంట్ అయి పలాస ఆసుపత్రిలో చేరారు. తాను చికత్సకు సహకరించబోనంటూ దివ్వెల మాధురి మొండి కేశారు. అయితే పోలీసులు నచ్చ చెప్పి ఆమెకు వైద్యం చేయించుకోవాలని చెప్పడంతో చివరకు ఆమె చికిత్స చేయించుకోవడానికి అంగీకరించారు. అయితే దివ్వెల మాధురి మాత్రం తాను చనిపోవాలని వెళుతున్నానని, అందులో భాగంగా కారును గుద్దినట్లు చెబుతున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స కోసం విశాఖ ఆసుపత్రికి తరలించనున్నారు.
కారును వెనక నుంచి...
కారు లక్ష్మీపురం టోల్గేట్ సమీపంలో బోల్తా పడటంతో తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. తాను ఆత్మహత్య చేసుకుందామనుకునే కారును వెనక నుంచి గుద్దానని మాధురి చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆమె ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్లు తేలింది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య దువ్వాడ వాణి, ఆయన కుమార్తె హైందవి నిరసనకు దిగడంతో పాటు దివ్వెల మాధురిపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఈ సమయంలో తన పరువుకు భంగం కలిగించినందుకు, తన కుమార్తెలకు భవిష్యత్ ఆందోళనలో పడిందని, తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
పక్కదోవ పట్టించేందుకే...
అంతేకాదు దువ్వాడ వాణిని కొట్టేందుకు కూడా తాను వెనకాడనని దివ్వెల మాధురి చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య, పిల్లలు ఆందోళనలు ఇంకా కొనసాగుతుండటంతో పాటు తనపై చేస్తున్న ప్రచారాన్ని భరించలేక, సహించలేక తాను ఆత్మహత్య చేసుకుందామని వెళుతున్నానని దివ్వెల మాధురి చెబుతున్నారు. అయితే మరోవైపు దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా డ్రామా అని, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు యాక్సిడెంట్ డ్రామాను క్రియేట్ చేశారని అంటున్నారు. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం మాత్రం టీవీ సీరియల్ లా కొనసాగుతుంది. మీడియా, సోషల్ మీడియాకు మాత్రం చేతినిండా పనిదొరికినట్లయింది.
Next Story