Sun Dec 22 2024 20:40:29 GMT+0000 (Coordinated Universal Time)
దీపావళి సెలవులో మార్పు
ఏపీలో దీపావళి సెలవును మారుస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీలో దీపావళి సెలవును మారుస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి సెలవును ఈ నెల 13వ తేదీకి మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో దీపావళి సెలవు ఇంతకు ముందు నవంబర్ 12న ఉండగా, తాజాగా దీనిని 13కు మార్పు చేసింది. గతంలో నవంబర్ 12న దీపావళి సెలవుగా ప్రకటించారు. ఇప్పుడు దాన్ని నవంబర్ 13కు మారుస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
దీపావళి ఏ రోజా అని కాస్త కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. పండితుల సలహా మేరకు ఈ సెలవును నవంబర్ 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నవంబర్ 13న ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్ధలకు కూడా నెగోషియబుల్ చట్టం కింద ఈ సెలవు వర్తించబోతోంది.
Next Story