Thu Apr 10 2025 11:14:31 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ జగన్ కు డీఎంకే ఆహ్వానం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తమిళనాడుకు చెందిన డీఎంకే నేతలు కలిశారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తమిళనాడుకు చెందిన డీఎంకే నేతలు కలిశారు. ఈ నెల 22వ తేదీన చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి హాజరు కావాలని ఆయనను కోరారు. తమిళనాడు మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ సభ్యులు విల్సన్ ను కలసి ఈ సమావేశానికి రావాలని స్వయంగా జగన్ ను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందచేశారు.
ఈ నెల 22న చెన్నైలో...
ఈ నెల 22న తమిళనాడులో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు కేంద్ర అనుసరిస్తున్న వివిధ అంశాలపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ లోని ముఖ్య నేతలను, ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. మరి జగన్ ఈ సమావేశానికి వెళతారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు.
Next Story