Sat Nov 23 2024 00:35:41 GMT+0000 (Coordinated Universal Time)
పరీక్షలపై కరోనా ఎఫెక్ట్.. జనవరి 30 వరకూ పరీక్షలన్నీ వాయిదా
తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అన్ని
దేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు.. అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సహా.. మరికొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు జనవరి 30వ తేదీ వరకూ సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో మాత్రం ఈ రోజునుంచి యదాతథంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై జగన్ ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. కాగా.. తాజాగా కరోనా ప్రభావం పరీక్షలపై పడింది.
తెలుగు రాష్ట్రాల పరిధిలో జనవరి 30వ తేదీ వరకూ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు యూనివర్శిటీ ప్రకటన విడుదల చేసింది. పరీక్షల కొత్త షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్సైట్లో చూడొచ్చని అధికారులు సూచించారు. అలాగే.. తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అన్ని యూనివర్శిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్శిటీ ప్రకటించింది.
Next Story