Tue Dec 24 2024 02:21:19 GMT+0000 (Coordinated Universal Time)
డ్రోస్ల సమ్మిట్ ప్రారంభం.. మనుషులను మోసుకెళ్లే డ్రోన్లను కూడా?
అమరావతిలో డ్రోస్ల సమ్మిట్ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమ్మిట్ ను ప్రారంభించారు
అమరావతిలో డ్రోస్ల సమ్మిట్ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమ్మిట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. ఈ సదస్సులో యాభై స్టాళ్లను ఏర్పాటు చేశారు. అందులో డ్రోన్ల ప్రదర్శనకు ఉంచారు.
రెండు రోజుల పాటు...
మనుషులను కూడా తీసుకెళ్లే డ్రోన్ లు ఈ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మినీ మొబైల్ హెలికాప్టర్ తరహాలో వీటిలో ప్రయాణించే అవకాశముంది. పౌర విమానయాన శాఖ, డీఎఫ్ఐ, సీఐఐ భాగస్వామ్యంతో ఈ డ్రోన్ల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5,500 డ్రోన్లతో ప్రదర్శన జరగనుంది. రాత్రి 6.30 గంటల నుంచి 8 గంటల వరకూ జరిగే ఈ ప్రదర్శనకు వేలాది మంది హాజరయ్యే అవకాశముంది.
Next Story