Tue Dec 24 2024 02:16:28 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అమరావతిలో డ్రోన్ షో
అమరావతిలో నేడు డ్రోన్ సమ్మిట్ జరగనుంది. దేశానికే ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ టెక్నాలజీ హబ్ గా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
అమరావతిలో నేడు డ్రోన్ సమ్మిట్ జరగనుంది. దేశానికే ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ టెక్నాలజీ హబ్ గా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసమే డ్రోన్ల సమ్మిట్ ను విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ కు ఇన్విస్టెర్లతో పాటు ఇన్వెంటర్లు కూడా హాజరు కానున్నారు. దాదాపు 5000లకు పైగా డ్రోన్ లతో షో నిర్వహించనున్నారు.
ఐదువేల డ్రోన్లతో...
సాయంత్రం నిర్వహించనున్న ఈ డ్రోన్ షోకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరుకున్నారు. ఈ సదస్సులో మొత్తం 53 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని డ్రోన్ హబ్ గా తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ షో తిలకించడానికి ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో హాజరు కానున్నారు.
Next Story