Mon Dec 23 2024 17:46:56 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : బస్సులు, రైళ్లేకాదండోయ్.. విమానాశ్రయాల్లో రద్దీ చూశారా?
విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ, విజయవాడ ఎయిర్ పోర్టులలో రద్దీ ఏర్పడింది.
విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ, విజయవాడ ఎయిర్ పోర్టులలో రద్దీ ఏర్పడింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు. ప్రధానంగా నాలుగోదశలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు స్వదేశానికి చేరుకుంటున్నారు.
ఏపీలో ఓటు వేయడానికే...
పోలింగ్ తేదీ ఈ నెల 13వ తేదీ కావడంతో మరో మూడు రోజులు కొనసాగే అవకాశముందని విమానాశ్రయాధికారులు తెలిపారు. విదేశాల నుంచి ఎక్కువగా భారత్ కు వచ్చే వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అన్ని దేశాల్లో టీడీపీ, వైసీపీలకు అభిమానులున్నారు. సామాజికపరంగా కూడా ఈసారి ఎన్నిక ప్రభావం చూపనుండటంతో వారంతా భారత కు క్యూ కట్టారు. ఏపీలో ఈ నెల 13వ తేదీన తాము అభిమానించే పార్టీకి ఓటు వేసి తిరిగి ప్రయాణమవుతారు.
Next Story