Sun Dec 22 2024 09:17:19 GMT+0000 (Coordinated Universal Time)
అలెర్ట్...ఈ రూట్లలో వారం రోజులు రైళ్లు నడవు
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రైల్వే శాఖ దాదాపు రెండు వందల రైళ్లను రద్దు చేసింది
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రైల్వే శాఖ దాదాపు రెండు వందల రైళ్లను రద్దు చేసింది. వాయుగుండం ఏర్పడి తర్వాత రేపు రాత్రికి కాని, ఎల్లుండి ఉదయం కానీ తుపానుగా మారి తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.
వారం రోజుల పాటు...
ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకూ రెండు వందల రైలు సర్వీసులను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. దీంతో పాటు రైల్వే శాఖ ఈ సమయంలో కొన్ని రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లను కూడా కేటాయించింది.
Next Story