Sun Dec 14 2025 23:24:01 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Diarrhea cases:గుంటూరులో దడపట్టిస్తున్న డయేరియో
గుంటూరు జిల్లాలో డయేరియా విజృంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Guntur Diarrhea cases:గుంటూరు జిల్లాలో డయేరియా విజృంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు డయేరియాతో నలుగురు మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే డయోరియా వంటి వ్యాధులు ఏమీ ప్రబలలేదని మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది.
గోప్యంగా ఉంచడంపై...
అధికారులు ఎందుకు ఈ విషయాన్ని దాచి పెడుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా అధికారులపై వత్తిడి తెచ్చి డయోరియో ప్రబలలేదని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలకు సురక్షిత నీరు కూడా సరఫరా చేయడంలేదంటూ ప్రతిపక్షాల విమర్శ చేస్తున్నాయి. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
Next Story

