Wed Apr 02 2025 13:29:17 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : ఈసారి తెప్పోత్సవానికి ఆటంకం?
విజయవాడలో ఈసారి దుర్గమ్మ తెప్పోత్సవం జరిగేట్లు కనిపించడం లేదు. కృష్ణానదిలో నీటి ప్రవాహం కారణమని అధికారులు చెబుతున్నారు

విజయవాడలో ఈసారి దుర్గమ్మ తెప్పోత్సవం జరిగేట్లు కనిపించడం లేదు. కృష్ణానదిలో నీటి ప్రవాహం కారణంగానే తెప్పోత్సవాన్ని ఘాట్ వద్దనే తెప్పోత్సవం జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 43,699 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఈ ప్రవాహం తగ్గితేనే రేపటి తెప్పోత్సవం జరపాలని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలోని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
నదీ ప్రవాహం....
రేపు అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుంది. దేవీ శరన్నవరాత్రుల ముగింపు వేడుకకు, దసరా రోజున ప్రతి ఏటా తెప్పోత్సవాన్ని కృష్ణానదిలో నిర్వహిస్తారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున రేపు తెప్పోత్సవం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏ విషయమూ రేపటి మధ్యాహ్నానికి తేలనుంది.
Next Story