Sun Dec 14 2025 10:08:30 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ - పాక్ మ్యాచ్లోనూ సీబీఎన్కు మద్దతుగా
భారత్ - పాక్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ కొందరు అభిమానులు చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ ను నిరసిస్తూ పలు చోట్ల ఆందోళన జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగుతున్నారు. హైదరాబాద్ వంటి నగరంలోనూ నిరసనలు చేస్తూ ఐ యమ్ విత్ సీబీఎన్ అంటూ యువత నుంచి మహిళల వరకూ ఏదో ఒక ఆందోళన జరుపుతూనే ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు మాత్రమే కాకుండా అమెరికా, కెనడా వంటి దేశాల్లోనూ పార్టీ అభిమానులు నిరసనలు తెలియజేస్తున్నారు.
ప్లకార్డులు పట్టుకుని...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి నేటికి 35 రోజులకు పైగానే అవుతుంది. ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ నెల 14న శనివారం భారత్ - పాక్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ కొందరు అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాక్ తో మ్యాచ్ భారత్ ఆడుతుండగా అభిమానులు కొందరు నిరసన వ్యక్తం చేయడం కనిపించింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story

