Sun Dec 22 2024 19:56:50 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో హై టెన్షన్.. 30 యాక్ట్ అమలు
వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలు అనేక మంది తిరుపతికి చేరుకుంటారని అనుమానంతో పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు.
ముందస్తు నోటీసులు...
మరోవైపు వైసీపీ నేతలతో పాటు కూటమి నేతలకు కూడా పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. జగన్ రాత్రికి తిరుపతికి చేరుకుంటుండటంతో ముందుగానే తిరుపతికి చేరుకునేందుకు రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలు, నేతలు వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంపులుగా తిరగవద్దంటూ మైకుల్లో హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
Next Story