Tue Mar 18 2025 00:31:47 GMT+0000 (Coordinated Universal Time)
ఇచ్ఛాపురంలో భూప్రకంపనలు
శ్రీకాకుళంలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి

శ్రీకాకుళంలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. ఇచ్ఛాపురం పరిసరాల్లో తెల్లవారుజామున 3.40 గంటలకు ఒకసారి, 4.03 గంటలకు మరోసారి భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇళ్లలో నిద్రిస్తున్న వారు భయపడి బయటకు పరుగులు తీశామని, ఇళ్లలో వస్తువులు కూడా కింద పడ్డాయని తెలిపారు.
మూడు సెకన్ల పాటు...
ఈరోజు తెల్లవారు జామున 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు చెబుతన్నారు. గతంలో కూడా ఇదే మాదిరి పలుమార్లు భూప్రకంపనలు సంభవిచాయి. తరచూ ఇలాంటి భూ ప్రకంపనలు చోటు చేసుకుంటుండటంతో దీనికి కారణాలపై అధికారులు సమాచారాన్ని ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story