Sun Dec 22 2024 23:33:20 GMT+0000 (Coordinated Universal Time)
అసని తుఫానును ఎదుర్కోడానికి సిద్ధమవుతున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే
అసని తుఫానును ఎదుర్కోడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగం సమాయత్తమవుతోంది. సైక్లోన్ సవాలును ఎదుర్కోడానికి
అసని తుఫానును ఎదుర్కోడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగం సమాయత్తమవుతోంది. సైక్లోన్ సవాలును ఎదుర్కోడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే కావాల్సిన గ్రౌండ్ వర్క్ ను పూర్తి చేసుకుంది. వాతావరణ సూచనల ప్రకారం తుఫాను దృష్ట్యా భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాఫిక్ పూర్తయినా, రైల్వే ట్రాక్‌లను త్వరగా పునరుద్ధరించడానికి ECoR ప్రణాళిక వేసింది. 24 గంటలూ పని చేసేలా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ ECoR హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలోనూ, సంబల్పూర్లోని ఖుర్దా రోడ్ లోనూ తెరవబడింది.
ట్రాక్‌ల ముందస్తు పునరుద్ధరణ, సిగ్నలింగ్ వ్యవస్థను మార్చడం, విద్యుదీకరణ మొదలైన వాటి కోసం ప్రత్యేక బృందాలను ECoR తీసుకొని వచ్చింది. ఒక వేళ విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఆ సమయంలో వినియోగానికి డీజిల్ లోకోమోటివ్లను ఉంచారు. ECoR తన అధికార పరిధిలోని బ్రాంచ్ లైన్లతో సహా హౌరా-చెన్నై మెయిన్‌లైన్‌లోని అన్ని స్టేషన్లను పరిశీలిస్తూ ఉంది. రైల్వే ట్రాక్ సమీపంలో వరదల వంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, రైల్వే కార్యకలాపాలు సాఫీగా జరిగేలా చూడాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ (I/C) సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నీటి కాలువలు, సైడ్ డ్రెయిన్లు సిల్ట్, ఇతర అడ్డంకులను తొలగించి వర్షపు నీరు స్వేచ్ఛగా ప్రవహించేలా చర్యలు చేపట్టడం జరిగింది. ఇతర అడ్డంకులను తొలగించాయి. చెట్ల కొమ్మలను కత్తిరించారు కూడానూ..! రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు కాలువల విషయంలో పూర్తి సరఫరా స్థాయి (FSL), వంతెనల విషయంలో ప్రమాద స్థాయి (DL) పెట్రోల్మన్, స్టేషనరీ వాచ్మెన్, డ్రైవర్లకు స్పష్టంగా కనిపించేలా అబట్మెంట్కు ఆనుకుని ఉన్న ప్రతి పీర్‌పై ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్యాండ్‌తో పెయింట్ చేశారు. ట్రాక్‌పై నీరు నిలిచిపోకుండా ఏర్పాట్లు చేశారు.
రైల్వే ట్రాక్‌లపై పెట్రోల్మెన్ల పెట్రోలింగ్‌ను కూడా ప్లాన్ చేశారు. వారు ఏదైనా ప్రమాదం, అంతరాయాన్ని గమనించి సంబంధిత వర్గాలకు తక్షణమే సమాచారాన్ని అందిస్తారు. మొబైల్ పెట్రోల్మెన్తో పాటు స్టేషనరీ పెట్రోల్‌మెన్, వాచ్మెన్లను పలు ప్రాంతాల్లో మోహరించారు. భారీ వర్షం వచ్చినప్పుడల్లా, సెక్షనల్ గ్యాంగ్మెన్లు ట్రాక్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తారని, రైళ్లు వెళ్లేందుకు ట్రాక్ సురక్షితంగా ఉందని వారు తెలియజేస్తారు. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయే అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలను వీరు పర్యవేక్షిస్తూ ఉంటారు. గుర్తించబడిన ప్రదేశాలలో ట్రాక్ & బ్రిడ్జ్ రిపేర్ రిజర్వ్ మెటీరియల్స్ అయిన బండరాళ్లు, ఇసుక, సిండర్, క్వారీ డస్ట్, బ్యాలస్ట్ వంటి వాటిని తగినంత పరిమాణంలో ఉంచడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇంజినీరింగ్ రిలీఫ్ వ్యాన్లు, వాటి పరికరాలు సిద్ధంగా ఉంచబడ్డాయి. ECoR భారత వాతావరణ శాఖతో నిరంతరం టచ్‌లో ఉంది.. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంది.
Next Story