Mon Dec 23 2024 16:36:10 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ జులై నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. eapcet కు సంబంధించి ఏప్రిల్ 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.
నోటిఫికేషన్ ఎప్పుడంటే....?
ఇక జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ కు సంబంధించి పరీక్షలుంటాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 134 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలోనూ నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
Next Story