Mon Dec 23 2024 08:20:13 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాధ్యాయులకు నారా లోకేష్ గుడ్ న్యూస్
ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు.
ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇటీవల తమ గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో 20 డిసెంబరు 2023 నుండి 10 జనవరి 2024 వరకు 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు.ఈ సమ్మె తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని 23% పెంచుతూ జనవరి 2024లో ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఆ మెమోలో 2019కు ముందు గౌరవ వేతనం పెంచని వాళ్లకు 23 శాతం పెంచడం జరిగినట్లు పేర్కొన్నారు.
వేతనాలు విడుదల చేసి...
ఈ నేపథ్యంలో 21 రోజులు సమ్మె కాలానికి వేతనం చెల్లించాల్సిందిగా ఇటీవల గౌరవ విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ ని సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిశారు. ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ గారు వేతనాలు విడుదల చేయడానికి అంగీకరించారు. సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ వేతనాలు సోమవారం విడుదల చేశారు.
Next Story