Sun Nov 17 2024 14:20:40 GMT+0000 (Coordinated Universal Time)
కందుకూరు ఘటన.. మృతులు వీరే
కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు
కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. ఆసుపత్రిలో కొందరు చికిత్స పొందుతున్నారు. కొందరు క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు. చంద్రబాబు కందుకూరు నుంచి సభలో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇళ్లకు చేరాలని చంద్రబాబు కోరారు. ప్రాణాలు త్యాగం చేసిన వారి కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు.
ఎనిమిది మంది మృతి...
గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం గ్రామానికి చెందిన చినకొండయ్య. కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెం నకు చెందిన కాకుమాని రాజా, ఉలవపాడు మండలం ఆత్మకూరు చెందిన దేవినేని రవింద్రబాబు, ఉలవపాడు మండలం ఒరుగుసేనుపాలెంకు చెందిన యాదగిరి విజయ, కందుకూరు మండలం కొండముడుసు పాలెంకు చెందిన కలవకూరి యానాది, గుడ్లూరు మండలం గుళ్ళపాలెంకు చెందిన యు. పురుషోత్తం , కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన గడ్డం మధుబాబు, కందుకూరు చెందిన రాజేశ్వరిలు మృతి చెందిన వారిలో ఉన్నారు.
Next Story