Mon Dec 23 2024 00:21:46 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీపై ఎన్నికల కమిషన్ సీరియస్.. చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం
తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సజ్జల భార్గవ రెడ్డిపై సిఐడి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం అని ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేసిందని టీడీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
వైసీపీ సోషల్ మీడియా ద్వారా....
దీంతో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్స్ ను, పింఛన్ లబ్దిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని ఫిర్యాదు చేశారు. కుట్రతో, విధ్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని భార్గవ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు• వర్ల రామయ్య ఫిర్యాదు ఆధారంగా వైసీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సిఐడి దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. •విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
Next Story