Mon Mar 24 2025 07:58:30 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో మోగిన ఎన్నికల నగారా
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను పరోక్ష పద్ధతిలో భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27న ఉప ఎన్నికలు నిర్వహించనుంది. కడప జెడ్పీ ఛైర్మన్, కర్నూలు జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్.ఎంపీపీలు - 28, వైస్ ఎంపీపీలు - 19, మండల ప్రజాపరిషత్లో కోఆప్టెడ్ సభ్యులు - 12 పోస్టులకు ఎన్నిక జరగనుంది.
ఈ నెల 27వ తేదీన...
అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 214 ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లో పేర్కొంది. పదవుల భర్తీకి వేర్వేరుగా ఏడు నోటిఫికేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. పూర్తి వివరాలకు ఆయా జిల్లా ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చని తెలిపింది. దీంతో ఈ పదవులను అధికార పార్టీ తమ సొంతం చేసుకునేందుకు వ్యూహం రచిస్తుంది. తమ వారిని కాపాడుకునేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలే చేయాల్సి ఉంది.
Next Story